సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్‌లోని డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న సర్వే ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. నమోదు చేసిన ప్రక్రియను పరిశీలించి ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, తదితరులు ఉన్నారు