ఆదిలాబాద్: పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయండి

74చూసినవారు
ఆదిలాబాద్: పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయండి
ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలో అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసి గ్రామాలలో గత ఏడాది ప్రారంభం కావలసిన పనులు నేటికీ ప్రారంభం కాలేదని, వెంటనే వాటిని ప్రారంభించి, ఆదివాసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ శివరాంను వారి కార్యాలయంలో మండల నాయకులతో కలిసి నిలిచిపోయిన పనుల గురించి ఆయనకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్