రాజీవ్ యువ వికాసం పథకం భాగంగా లోన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఆదిలాబాద్ పట్టణ లబ్ధిదారులు దరఖాస్తు కాపీలను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని కమిషనర్ సీవీఎన్ రాజు తెలిపారు. దరఖాస్తు ఫామ్‌తో పాటు ఆధార్ కార్డు, రేషన్‌కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ కాపీలను జత చేసి కార్యాలయంలోని కౌంటర్‌లో అందజేయాలన్నారు. ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించాలని కోరారు.