సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను ఆదివారం ఆదిలాబాద్‌లోని రాంనగర్ కాలనీలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నలిని రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అధికారం చేపట్టిన పదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు.