తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆదిలాబాద్ డిడబ్ల్యుఓ మిల్కా తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ నెల 18 లోపు https: //tgobmms. cgg. gov. in/ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కమిటీ పరిశీలించి నిబంధనల మేరకు అర్హత గల దివ్యాంగులను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. వివరాలకు 08732 222058 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.