ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని సూచనలు చేశారు. సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం నిర్వహించే పరేడ్‌లో పాల్గొని నిర్వహించే కవాతులో పరిపూర్ణత చెందాలన్నారు. ప్రతి ఒక్కరు యూనిఫామ్ కు ఉన్న గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలన్నారు.