ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ మాత్రలు మందులను వాడకూడదని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. ఇష్టారీతిన మందులను వాడటం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపి సమస్యలు వస్తాయన్నారు. ప్రపంచ కిడ్నీ డే వేడుకలను గురువారం రిమ్స్ డయాలసిస్ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు.