జిల్లా పోలీస్ యంత్రాంగం రౌడీయిజం చేసే వారిని ఉక్కు పాదంతో అణచివేస్తుందని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి జిల్లా రౌడీలకు వార్నింగ్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు అక్రమార్కులపై కఠినమైన చర్యలు తీసుకుంటూ, రౌడీయిజాన్ని కనుమరుగు చేస్తామన్నారు. బాధిత ప్రజలు నిర్భయంగా సంబంధిత పోలిస్ స్టెషన్ లేదా నేరుగా జిల్లా ఎస్పీ వాట్సాప్ నంబర్ కు 8712659973 సంప్రదించాలని కోరారు.