ఆదిలాబాద్: విద్యా కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి

69చూసినవారు
ఆదిలాబాద్: విద్యా కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆకునూరి మురళి ఆధ్వర్యంలో నియమించిన విద్యా కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని జిల్లా టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షుడు కిష్టన్న డిమాండ్ చేశారు. ఆదివారం సంఘం 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని ఆఫీసు వద్ద పతాకావిష్కరణ చేసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం ప్రక్షాళనకు పూనుకోవడం అభినందనీయం అన్నారు. ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణ్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్