ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. టీజీవో సంఘ అధ్యక్షుడిగా నియమితులైన ఆయనను గురువారం జిల్లా వ్యవసాయ విస్తీర్ణ అధికారుల (ఏఈఓ) సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఈఓ అధ్యక్షులు గంగారెడ్డి, శ్రీధర్ స్వామి, విశ్వనాథ్, తదితరులు ఉన్నారు.