
వాయిదా పడిన మున్సిపల్ స్థానాలకు నేడు ఎన్నికలు
AP: కోరం లేకపోవడం, ఇతర కారణాలతో వాయిదా పడిన 5 డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సర్ స్థానాలకు మంగళవారం మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నందిగామ, పాలకొండల్లో చైర్పర్సన్, తుని, పిడుగురాళ్లలో వైస్ చైర్పర్సన్ స్థానాలకు ఉ.11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.