ఆదిలాబాద్: నర్సరీలో అగ్నిప్రమాదం

50చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హ్యాండీక్యాప్ కాలనీ సమీపంలోని హార్టికల్చర్ నర్సరీలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నర్సరీలోని మామిడి వనంలో చెత్తాచెదారానికి నిప్పు అంటుకోవడంతో వేగంగా మంటలు విస్తరించాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకోవచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్