

ఇరాన్ దాడులు.. 10 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి (వీడియో)
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. శనివారం రాత్రి ఇరాన్ చేపట్టిన క్షిపణి దాడుల్లో 10 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. రాత్రివేళ జరిగిన ఈ దాడుల్లో చాలా మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. పలు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.