ఆదిలాబాద్: అగ్నిమాపక కేంద్రానికి నిధులు మంజూరు

64చూసినవారు
ఆదిలాబాద్: అగ్నిమాపక కేంద్రానికి నిధులు మంజూరు
ఆదిలాబాద్ అగ్నిమాపక  కేంద్రానికి ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. దీంతో పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఈఈ సుందర్, అభియంత ఆశిర్వాదం, జిల్లా అగ్నిమాపక అధికారి సురేష్ తో కలిసి స్థల పరిశీలన చేశారు. భవన నిర్మాణానికి ఎంత స్థలం అవసరం, తదితరాలను సమీక్షించారు. గుత్తేదారుతో అగ్రిమెంటు చేసుకోవాల్సి ఉందని, ఒప్పందం అనంతరం 9 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్