ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని, పాడి పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. ఆమె శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రజలకు ఉన్న పలు సమస్యలను వివరించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, కనక ప్రతిభ, శ్రీధర్ పాల్గొన్నారు.