ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా జరగాలని మాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ మాట్లాడుతూ. వర్గీకరణను మాలలు అడ్డుకోవడం లేదన్నారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'లక్ష డప్పులు వేయి గొంతులు' కార్యక్రమాన్ని మాలలపై కాకుండా వర్గీకరణ చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ పై చేయాలని సూచించారు. నాయకులు పాశం రాఘవేందర్, తదితరులున్నారు.