
TG: తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం: ఉత్తమ్
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8,348 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ధాన్యం దిగుబడి పెరగడంతో కొనుగోలు కేంద్రాలను పెంచినట్లు వివరించారు. వచ్చే 10, 12 రోజులు కొనుగోళ్ల కేంద్రాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు సచివాలయంలో పౌర సరఫరాల శాఖ పనులపై మంత్రి సమీక్షించారు.