కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీల నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సాజిద్ ఉద్దీన్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వెంటనే ఆప్షన్ తీసివేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరి పాలన కొనసాగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు.