ఆదిలాబాద్: హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం

59చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలు ప్రజలకు వివరించాలని, వైఫల్యాలను ఎండగట్టాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం జైనథ్, భోరజ్, సాత్నాల మండలాల నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు 420 హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, వాటి అమల్లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్