హనుమాన్ జయంతి వేడుకలను శనివారం ఆదిలాబాద్ లో ఘనంగా జరిపారు. పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని అతి పురాతనమైన విజయ హనుమాన్ మందిరంలో పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆంజనేయ స్వామిని ప్రత్యేక అలంకరణ జరిపి పూజలు చేశారు. భారీ ఎత్తున హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది.