ఐ. ఎన్. టి. యుసి అనుబంధ ఆదిలాబాద్ ఆటో యూనియన్ కార్యవర్గాన్ని శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా షేక్ ఫయిమ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ లను ఎన్నుకున్నారు. వీరికి ఐ. ఎన్. టి. యు. సి రాష్ట్ర నాయకులు మునిగెల నర్సింగ్ నియామకపత్రాలు అందజేసి ఆభినందించారు. నూతన కార్యవర్గం ఆటో డ్రైవర్ల సంక్షేమంతో పాటు ప్రయాణికులకు రక్షణ, నాణ్యమైన సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు.