ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లోని ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి వినోద్ అవగాహన నిర్వహించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా, నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అనుకోకుండా ఎవరైనా ప్రయాణికులు తమ వస్తువులు బ్యాగులు మరిచిపోతే స్టేషన్లో అప్పగించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు.