ఆదిలాబాద్ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం కేంద్ర కార్మిక, రైతు సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దేవేందర్ ఖండించారు. కేంద్ర బడ్జెట్లో జిల్లా అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంలో స్థానిక బీజేపి ఎంపీ విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌కు నిరసిస్తూ ఈనెల 5న ఆందోళన కార్యక్రమంలో చేపడుతున్నామన్నారు.