అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇంద్రవెల్లిలో దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మార్కెట్ ఛైర్మన్ ముఖాడే ఉత్తం మాట్లాడుతూ. జగదీశ్వర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు జహీర్, నాగోరావ్, మసూద్ ఉన్నారు.