సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించి మాదిగలకు న్యాయం చేశారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్ ఆమోదం పొందడం పట్ల ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద శనివారం స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బిక్కీ గంగన్న, దర్శనాల నాగేష్, నక్క రాందాస్, నరేష్, లక్ష్మణ్, అశోక్, తదితరులున్నారు.