ఆపరేషన్ కగార్ లో భాగంగా శాంతి చర్చలకు సిద్ధమైన మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం చంపడం దారుణమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ ఆరోపించారు. ఆమె సోమవారం బోథ్ మండలం పొచ్చెరలో మావోయిస్టు కీలక నేత అడెళ్లు భాస్కర్ అలియాస్ అంత్యక్రియలకు హాజరయ్యారు. మావోయిస్టులను హతమార్చి బహుళ జాతి కంపెనీలకు ఖనిజ సంపద దోచి పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని అన్నారు.