ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన రాజకీయాలను ఓడిద్దాం. ఉద్యమ నాయకత్వాలను ఎన్నుకుందామని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ కోరారు. టీఎస్ యుటిఎఫ్ బలపర్చిన టిపిటిఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్‌కు మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపించాలన్నారు. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడారు. టీఎస్ యుటిఎఫ్ నాయకులు కిష్టయ్య, అశోక్, గౌస్ మొయినుద్దీన్, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్ ఉన్నారు.