కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్ అన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేసేలా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. కేంద్రం ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులను కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కార్మిక లోకానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు పోరాడతామని ఆమె స్పష్టం చేశారు.