ఆదిలాబాద్: లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

77చూసినవారు
ఆదిలాబాద్: లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320జీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మంద అశోక్, కార్యదర్శి దుర్గే భగవాన్‌దాస్, కోశాధికారిగా గంగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి లయన్స్ జిల్లా రెండో గవర్నర్ గుంటుక చంద్రప్రకాశ్ పాల్గొని వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్