ఆదిలాబాద్‌: మాదిగ కులస్తుల సంబరాలు

81చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక కలెక్టర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా జై మాదిగ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వర్గీకరణతో మాదిగ కులాలలో వెనుకబడిన వారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్