ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడిఏ క్వాటర్స్ పక్కన ఉన్న జీసీసీ గోదాంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న ప్రజలు, స్థానికులు గోదాం నుండి పొగ, మంటలు రావడంతో వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను ఆర్పారు. గోదాంలో గన్నీ సంచులు ఉన్నాయని, వాటి విలువ రూ 25 లక్షల వరకు ఉంటుందని గోదాం క్లర్క్ చందూలాల్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.