సాక్షి కార్యాలయాలు, వివిధ మీడియా సంస్థల పై ఆయా ప్రభుత్వాలు చేస్తున్న దాడులకు నిరసనగా బుధవారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ లో చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని జర్నలిస్టులు జయప్రదం చేయ్యాలని ఎడిటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ మంగళవారం పిలుపునిచ్చారు. ఏలూరులోని సాక్షి కార్యాలయాలపై దుండగులు నిప్పు పెట్టడం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుపై చూపే చిన్న చూపుకు నిదర్శనమని ఆయన అన్నారు.