హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని స్వామివారి పల్లకి మోశారు. అనంతరం జిల్లా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బీజేపి నాయకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.