రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని, విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలన్నారు. నాయకులు నిఖిల్, మహేశ్, సాయి, గణేష్ ఉన్నారు.