సరస్వతి పుష్కరాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం, ఆయన ఫోటో పెట్టకపోవడం మాలలను అవమానించడమేనని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. కొప్పుల రమేష్ అన్నారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ ఫోటో పెట్టకపోవడంపై ఆయన మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెంటనే వంశీకృష్ణకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేతలు రాఘవేంద్ర, మల్లన్న, రఘు తదితరులున్నారు.