ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆఫీసర్స్ క్లబ్లో 8 డైరెక్టర్ల పదవుల కోసం 13 మంది బరిలో నిలిచారు. మొత్తం 320 ఓట్లు ఉన్నాయి. సభ్యులు బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల అధికారిగా డీసీఓ మోహన్ వ్యవహరిస్తున్నారు. వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై అశోక్ తదితరులు ఉన్నారు.