ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. సమాాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్, డీసీపీయూ, చైల్డ్ లైన్, షూర్ ఎన్జీవో, పోలీసులు కలిసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ మేరకు బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరమని ఒక్క డీసీపీయూ సంరక్షణ అధికారి ఎన్.స్వామి తెలిపారు. బాల్య వివాహం నిషేధ చట్టం ద్వారా రూ. 2 లక్షల జరిమానా, సంవత్సరంపాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు వారు హెచ్చరించారు.