
ఇవాళ యూరప్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు బుధవారం యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20న చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో అక్కడే జరుపుకోనున్నారు. ఇవాళ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన విదేశాలకు వెళ్తారు. తిరిగి ఈ నెల 22న ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.