ఆదిలాబాద్ లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజ్ కావడంతో పానీపూరి బండిలో మంటలు చెలరేగిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్ధానిక శనీ మందిర్ వద్ద వికాస్ అనే వ్యక్తి పానీపూరి బండి నడుపుతుంటాడు. సాయంత్రం సమయంలో బండిలో ఉన్న గ్యాస్ ఒకే సారి లీకేజ్ కావడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు స్పందించి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో బండి పూర్తిగా దగ్ధం కావడంతో దాంట్లో ఉన్న వస్తువులు కాలిపోయాయి.