సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ క్రైమ్ బాధితులు వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు. లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. వారంలో జిల్లాలో ఐదు ఫిర్యాదులు నమోదైనట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ నేరస్థులు రోజురోజుకూ నూతన పద్ధతులను ఉపయోగిస్తూ.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారని పేర్కొన్నారు.