ఆదిలాబాద్ జిల్లాలో ఎటు చూసినా బెల్టు షాపుల కిక్కు ఫుల్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. యువత మద్యానికి బానిస అవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మద్యానికి బానిసై నేరస్తులుగా మారి పలు కేసుల్లో చిక్కు కుంటున్నారు. ఈ విషయంలో స్పందించిన పోలిస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలనుసారం ఇల్లీగల్ దందాల పై ప్రత్యేక దృష్టి సారించారు.