నిజామాబాద్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిచరణ్ అధికారుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని టీజీఓ సంఘం అధ్యక్షుడు శివకుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ ఆరోపించారు. సాయిచరణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆదిలాబాద్ లోని ఆర్. డబ్ల్యూ. ఎస్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు.