ఎన్నికల సమయంలో ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ మహిళ విభాగం ఆదిలాబాద్ అధ్యక్షురాలు స్వరూప డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రధాన కార్యదర్శి మమత, పర్వీన్, కస్తాల ప్రమీల, కరుణ తదితరులున్నారు.