ఆదిలాబాద్: ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని నిరసన

70చూసినవారు
ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మాల, మహార్ కులస్థులు ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రాలను దహనం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పున: పరిశీలించాలని నాయకులు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్