వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట వీధి వ్యాపారులు చేపడుతున్న దీక్ష గురువారం 23వ రోజుకు చేరుకోగా. ఎంఐఎం నాయకులు మద్దతు తెలిపారు. వ్యాపారం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.