ఆదిలాబాద్: పుస్తకపఠనం అలవాటు చేసుకోవాలి

74చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రవాస భారతీయ వాసవి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పుస్తక మిత్ర (లైబ్రరీ)ను జిల్లా కలెక్టర్ రాజార్షిషా ప్రారంభించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సిలబస్, రివిజన్ గురించి అడిగి తెలుసుకున్నారు. జ్ఞానం, ఆలోచన శక్తి పెరగాలంటే విద్యార్థులు నిత్యం పుస్తకపఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. డీఈఓ ప్రణీత, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్