ఆదిలాబాద్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క కోరారు. శనివారం హైదరాబాదులో రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకాటి శ్రీహరి ఆమె మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి ఆదిలాబాద్ లో ఎక్కువగా గిరిజనులు ఉన్నారని వారి అభివృద్ధి కోసం పాడి పరిశ్రమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.