ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణం లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌బుక్స్, పెన్నులు అందించారు. డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, కోఆర్డినేటర్ సుజాత్‌ఖాన్, మరాఠీ మీడియం స్కూల్ హెచ్ఎం గణేశ్, తదితరులున్నారు.