ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లోని ఆర్పిఎఫ్ స్టేషన్ను ఆర్పిఎఫ్ డిఐజి ఎండీ షాదాన్ జెబ్ ఖాన్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్, సిబ్బంది పని తీరును ఆయన సమీక్షించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం డిఐజిని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించే స్వాగతించారు.