గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు ఇంద్రవెల్లి వైపు నుంచి గుడిహత్నూర్ వైపు వస్తున్న క్రమంలో పున్నగూడ గ్రామ సమీపంలో రాగానే బస్సుపై ఒక్కసారిగా చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.